పగలంతా దంచికొట్టిన ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ సిటీ జనాలకు సాయంత్రం అయ్యేసరికి కూల్ కూల్ వెదర్‌తో రిలీఫ్ దక్కింది. కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాజధాని వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు, వర్షం కురుస్తోంది. కాలాపత్తర్, జూపార్క్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.
చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి, మలక్‌పేట్, అంబర్‌పేట్, నారాయణగూడ ప్రాంతాల్లో వాన పడుతుండటంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్‌లోనూ చినుకులు.. ఘట్‌కేసర్‌లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. నగర శివారు బహుదూర్‌పురా, పాతబస్తీ, దుండిగల్, సూరారం, దూలపల్లి ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి.