టాటా ఐపీఎల్ 2022లో 28వ మ్యాచ్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) ముంబైలోని డీవైపాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సూపర్ ఆటతీరు కనబరిచారు. ఇందులో ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లు, భువనేశ్వర్‌కుమార్ 3 వికెట్లు తీసి పంజాబ్ నడ్డీ విరగ్గొట్టారు. నటరాజన్, జగదీశ్ సుచిత్‌కి చెరో వికెట్ దక్కింది.
కాగా, పంజాబ్ బ్యాట్స్‌మన్‌లో శిఖర్ ధవన్ (8), సిమ్రాన్ సింగ్ (14), జానీ బరిస్తో (12), జితేష్ శర్మ (11), ఓడియన్ స్మిత్ (13), షారుఖ్ ఖాన్ (26) పరుగులు మాత్రమే చేశారు. రాహుల్ చాహర్ (0), వైభవ్ అరోరా(0) డకౌట్లుగా వెనుతిరిగారు. ఈ టీమ్‌లో లివింగ్‌స్టోన్ (60) ఒక్కడే గౌరవప్రదమైన స్కోరు చేయడంతో పంజాబ్ టీమ్ ఆమాత్రం స్కోరు సాధించింది.