Thursday, November 21, 2024

లైఫ్ సైన్సెస్ హ‌బ్ హైద‌రాబాద్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్‌ అతిపెద్ద నగరమని చెప్పారు. ఈ రంగంలో హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని, ఇక్కడ 800కు పైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలున్నాయని కేటీ ఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ లో మూడు రోజుల పాటు జరుగనున్న బయో ఆసియా-2023 సదస్సును శుక్రవారం ఫార్మారంగ దిగ్గజ కంపెనీల సీఈవోలతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగా ణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయ న్నారు. 2030నాటికి లైఫ్‌సైన్సెస్‌ రంగం విలువ రెట్టింపు చేసి 100బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 2022లోనే 80బిలియన్‌ డాలర్ల విలు వకు చేరుకున్నామని మంత్రి కేటీఆర్‌ తెలి పారు. దీంతో లక్ష్యాన్ని సవరించి 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్ల విలువకు పెంచామ న్నారు. 100 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని 2025లోనే చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్‌సైన్సెస్‌ రంగం గడిచిన రెండేళ్లలో 23 శాతం వృద్ధి నమోదు చేసుకుందని చెప్పా రు. తెలంగాణ ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగ ఎకో సిస్టమ్‌కు నిలయంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరు గుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశీయ ఔషద ఎగుమతుల్లతో 30శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40శాతం, ఏపీఐ ఎగుమ తుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతు న్నదని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో 20కి పైగా లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్లు ఉన్నాయని అవార్డును ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని, లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌ అవతరించిందని తెలిపారు.

ప్రపంచ హెల్త్‌ టెక్‌ మక్కాగా హైదరాబాద్‌…
ప్రపంచపు హెల్త్‌ టెక్‌ మక్కాగా హైదరాబాద్‌ను నిలిపేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. పలు ఇంక్యుబేటర్‌ కార్యక్రమాల ద్వారా డీప్‌ కంప్యూటింగ్‌ వనరులతో హెల్త్‌కేర్‌ రంగాన్ని సమ్మిళితం చేసి వృద్ధిని పరుగులు పెట్టించనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప లైఫ్‌సైన్సెస్‌ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్నప్పటికీ ఇంతటితో ఆగిపోకుండా లైఫ్‌సైన్సెస్‌ రంగానికి మరో కొత్త ఆకృతినిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌ ఇక మా కార్పొరేట్‌ కేంద్రం: నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌
హైదరాబాద్‌ ఇక ఎంత మాత్రమూ నోవార్టిస్‌కు సర్వీస్‌ సెంటర్‌ కాదని, ఇది కార్పొరేట్‌ కేంద్రమని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌ తెలిపారు. 15ఏళ్ల క్రితం తమ కంపెనీ ఇక్కడ ఒక కెపాసిటీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు వచ్చిందని, ఇప్పుడు కంపెనీ కార్యకలాపాలు 10 రెట్లు పెరిగాయన్నారు. హైదరాబాద్‌ నగర వృద్ధి భారత దేశ వృద్ధిలో ఎంతో కీలకమన్నారు. హైదరాబాద్‌లో కావాల్సినన్ని నైపుణ్య వనరులున్నాయని, పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు నరసింహన్‌ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ ఫార్మా కంపెనీల సీఈవోలు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, బిజెనెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, లైఫ్‌సైన్సెస్‌ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వ్యక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement