– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
హైదరాబాద్ సిటీలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) రూ. 8,161 కోట్ల విలువైన ఆకాష్ వెపన్ సిస్టమ్‌ను తయారు చేసి భారత సైన్యానికి అందివ్వనుంది. దీనికి గాను రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. భారత సైన్యంలోని రెండు రెజిమెంట్ల కోసం, మూడు సంవత్సరాల కాల పరిమితితో డీల్ చేసుకున్నారు. అదనంగా BDL MLH హెలికాప్టర్లకు, కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్(CMDS) కోసం మరో రూ. 261 కోట్ల ఆర్డర్‌ను కూడా బీడీఎల్ పొందింది. ఈ కొత్త ఒప్పందంపై సంతకం చేయడంతో BDL యొక్క కంబైన్డ్ ఆర్డర్ బుక్ స్థానం ఇప్పుడు సుమారుగా రూ. 24,021 కోట్లకు చేరుకుంది.
BDL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్రా (రిటైర్డ్) కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. ఆకాష్ ప్రోగ్రామ్‌కు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని.. BDL, దాని సరఫరా చైన్ భాగస్వాములు ఆయుధ వ్యవస్థ యొక్క తయారీ డిమాండ్లను సంతృప్తి పరచడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.. స్థానిక మార్కెట్‌తో పాటు స్నేహపూర్వక దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు ఆకాష్ వెపన్ సిస్టమ్‌ను రెడీ చేస్తున్నట్టు తెలిపారు.
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుండి స్వీకరించిన కొత్త ఆర్డర్లు, అత్యాధునిక ఉత్పాదక సౌకర్యాల స్థాపన, సాయుధ దళాల కోసం కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్టు వారు తెలిపారు. శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం విదేశీ, భారతీయ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై కూడా సంతకం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రా MK-I ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ (AAM), భారత వైమానిక దళం, భారత నావికాదళానికి సంబంధించిన పరికరాలతో సహా వివిధ వ్యవస్థల డెలివరీ కోసం BDL అనేక ఆర్డర్లను పొందింది. అంతేకాకుండా BDL కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్ కోసం ఆర్డర్‌ను అందుకుంది.
BDL తన భానూర్ యూనిట్లో వార్‌హెడ్ తయారీ సౌకర్యాన్ని, కంచన్‌బాగ్ యూనిట్లో సీకర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కలిగి ఉంది. BDLని ప్రపంచంలోని RF సీకర్ తయారీదారులు, టెస్టర్ల యొక్క ప్రత్యేకమైన క్లబ్‌గా ఎలివేట్ చేసింది. భారత ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఆత్మనిర్భర్ ని సాకారం చేసుకునేందుకు BDL చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక ప్రధానమైన ముందడుగు. ఇంకా.. ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవ కింద UKతో TOT ఒప్పందం ప్రకారం.. BDL అత్యాధునిక VSHORADS (వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్), లేజర్ బీమ్ రైడింగ్ ఆయుధాలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.