దేశ వ్యాప్తంగా 400వందేభారత్ రైళ్లకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరానికి వందేభారత్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయట. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్-ముంబయి, కాచిగూడ-బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్‌లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..