Friday, November 22, 2024

గత మూడు రోజులుగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. పెరిగిన వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1788 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.676 వద్ద ఉంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.83 లెవెల్స్‌పైన కూడా ట్రేడయింది. ఇక దేశీయంగా కూడా బంగారం ధరలు పడిపోతున్నాయి. గత 5 రోజుల్లో 3 సార్లు గోల్డ్ రేటు తగ్గింది. ఈ క్రమంలోనే రూ.1000 దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.350 తగ్గి .. రూ.49,600 వద్ద ఉంది.

24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పతనమై.. రూ.54,110 వద్ద కొనసాగుతోంది. ఇక దిల్లీలో గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.350 తగ్గి రూ.49,750 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 380 తగ్గి.. రూ.54,260 వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే మాత్రం స్వల్పంగా పెరుగుతోంది. తాజాగా రూ.100 మేర పెరిగి హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100 వద్ద కొనసాగుతోంది. 3 రోజుల వ్యవధిలో రూ.600 పెరిగింది. అంతకుముందు 2 రోజుల్లో మాత్రం రూ.1500 తగ్గడం గమనార్హం. దిల్లీలో కిలో వెండి రేటు రూ.200 పెరిగి రూ.69,500 వద్ద ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధానిలో వెండి రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. స్థానిక పన్నులు, పరిస్థితులు దీనికి కారణంగా చెబుతారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement