నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.350 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రూ.52,350కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 మేర పెరిగి.. రూ.57,110 మార్కుకు చేరింది. ఇటీవలి కాలంలో ఇదే గరిష్టం కావడం విశేషం. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.350 ఎగబాకి.. రూ.52,500 మార్కును తాకింది. ఇక దేశరాజధానిలో 10 గ్రాముల బంగారం రేటు 24 క్యారెట్లకు రూ.380 మేర పెరిగి రూ.57,270 వద్ద కొనసాగుతోంది. వెండి ధర విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఒక్కరోజే భారీగా తగ్గింది. రూ.1400 పతనంతో.. కిలో వెండి ధర రూ.72,100కు చేరింది. ఇటీవల ఇది రూ.75,800 వద్ద ఉండటం గమనార్హం. 4 రోజుల్లోనే ఏకంగా రూ.3700 తగ్గింది. ఇక దిల్లీలో వెండి రేటు వరుసగా 3 రోజుల్లో మొత్తం రూ.1000 తగ్గగా.. ఇప్పుడు రూ.200 పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలో సిల్వర్ రూ. 72,100 వద్ద ట్రేడవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement