Friday, November 22, 2024

హుజురాబాద్ లో మూడు ముక్కలాట.. ఉపఎన్నిక రెఫరెండం

హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. హుజురాబాద్ సీటును కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలకు పదను పెట్టాయి. ఈ ఉప ఎన్నిక రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మారునుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికను సవాల్ గా మారింది.

ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాక ముందే బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఓ రౌండ్ చుట్టేశారు. బీజేపీ రథంలో గ్రామ, గ్రామాలకు తిరుగుతున్నారు. బీజేపీ సంగతి పక్కన బెడితే అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఈటలకు ధీటైన అభ్యర్థిగా కోసం ఈ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కడియం శ్రీహరి, ఎల్.రమణ సహా పలువురి పేర్లు పరిశీలించింది. అయితే, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ టికెట్ తనకే అని చెబుతున్న ఆడియో వైరల్ కావడంతో, అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డినే ప్రకటిస్తారా? లేక మరెవరికైన ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది? అన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగలు ఇప్పుడే బయటకు వెళ్లిపోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో కొత్త అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను అభ్యర్థిగా దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల ఈ మూడు పార్టీలకు హుజురాబాద్ ఉపఎన్నిక చావోరేవో అన్నట్లు మారింది. ఇప్పుడు వచ్చే ఫలితం.. అసెంబ్లీ ఎన్నిలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నాయి. అందుకే, హుజురాబాద్ ఉపఎన్నికను రెఫరెండంగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement