ఇండియాలో పుట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి .. అమెరికాకి కోడలు అయింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి తెలిసిన విషయాలే. బాలీవుడ్లో సినిమాలను తగ్గించి.. వరుసగా.. హాలీవుడ్ సినిమాలను చేస్తూ.. బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం.. ఈ బ్యూటీ.. తన భర్తతో కలిసి లాస్ ఏంజెస్లో ఎంజెయ్ చేస్తోంది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్ పేరును తీసివేయడంతో.. దూమారం చెలరేగింది. వీరిద్దరూ వీడిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పుకార్లు షికార్లు చేశాయి. అయితే.. ఈ రూమర్స్ మీద ప్రియాంక తనదైన స్టైల్స్ స్పందించింది. తాజాగా తన మూడో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొని.. వాటికి చెక్ పెట్టింది.
కాగా తన భర్త నిక్ జోనస్ ని బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నట్టు ఓ వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ హిందీ దర్శకుడి డైరెక్షన్ లో నిక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఫ్లాన్ చేస్తుందట. తాజాగా నిక్ జోనస్ కూడా ఈ విషయం మీద ఓ క్లారటీ ఇచ్చాడు. రీసెంట్ గా ఓ ఇంటర్యూలో పాల్గోన్న నిక్ బాలీవుడ్ సినిమాలో నటించనున్నట్లు తెలిపారు. మరి నిక్ జోనస్ బాలీవుడ్ తెరంగేట్రం ఎలాంటి సినిమాతో ఉండబోతుందో చూడాలి. ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సతి అనే పాత్రలో నటించనుంది. అలాగే టెక్ట్స్ ఫర్ యూ, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్ రూపొందించే జీ లే జరా చిత్రంలో ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..