Friday, November 22, 2024

ఒకే సీటు కోసం భార్యభర్తల పట్టు, భార్య యోగీ కేబినెట్‌లో మంత్రి

లక్నో : యూపీ.. లక్నోలోని సరోజిని నగర్‌ అసెంబ్లి స్థానానికి సంబంధించిన టికెట్‌ కేటాయింపు తెగ వైరల్‌ అవుతున్నది. ఒకే సీటు కోసం భార్య భర్తలు ఇద్దరూ పోటీ పడుతున్నారు. బీజేపీలో ఈ పరిస్థితి నెలకొంది. తనకంటే తనకే టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సదరు భార్య స్వాతీ సింగ్‌… ప్రస్తుతం యోగీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఆమె భర్త శంకర్‌ సింగ్‌.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హోదాలో ఉన్నారు. సరోజినీ నగర్‌ నుంచి స్వాతిసింగ్‌ గెలిచి యోగీ కేబినెట్‌లో స్థానం సంపాధించుకుంది. అయితే ఈ టికెట్‌ మళ్లి తనకే కేటాయించాలని ఆమె పట్టుబడుతున్నది. అయితే ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని శంకర్‌ సింగ్‌ పట్టుబడుతున్నాడు.

దీంతో బీజేపీ అధిష్టానానికి ఈ సీటు కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. స్వాతి సింగ్‌ అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేశారు. 2016, జులైలో శంకర్‌ సింగ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతను భార్యను రాజకీయాల్లోకి దించారు. ఆరోపణల సమయంలో శంకర్‌ సింగ్‌ బీఎస్‌పీలో ఉన్నారు. మాయవతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. శంకర్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. బీజేపీ రంగ ప్రవేశం చేసి.. శంకర్‌ సింగ్‌ను ఆదుకుంది. వారం రోజుల తరువాత.. శంకర్‌ సింగ్‌ భార్య స్వాతి సింగ్‌కు బీజేపీ టికెట్‌ ఇవ్వగా.. గెలుపొందింది. కేబినెట్లో చోటు సంపాధించుకుంది. మంత్రిగా ఉన్న సమయంలో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వివాదాల కారణంగానే.. గతంలో టికెట్‌ ఇవ్వలేదని, ఈసారి భార్యపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తనకు అవకాశం కల్పించాలని శంకర్‌ సింగ్‌ కోరుతున్నాడు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement