ఇప్పుడంటే ఇసుక..సిమెంట్ తో కాంక్రీట్ ఇళ్ళు నిర్మితమవుతున్నాయి. కానీ అప్పట్లో మట్టితో,,సున్నంతో ఇంటిని నిర్మించుకునేవారు. నేటి ఆధునిక ప్రపంచంలో కొన్ని నిర్మాణాలు నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిపోతున్నాయి. అయితే 900ఏళ్ళనాటి ఇళ్ళు ఇప్పటి చెక్కు చెదరలేదంటే నమ్ముతారా..కానీ ఇది అక్షరాలా నిజమండీ. ఎక్కడ వున్నాయి ఆ ఇళ్లు అనుకుంటున్నారా.. ఇథియోపియాలోని ఇప్పటికీ చెక్కుచెదరకుండా సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంది ఓ గ్రామం. 900 ఏళ్లనాటి ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉన్నాయి.
కానీ, ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి,. లోపలికి రాకపోకలు సాగించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు ఉన్నా, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేం దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదని తెలిపారు. మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచిందని షాంకే వాసులు గర్వంగా చెబుతున్నారు.
ప్రపంచంలోనే ఎతైన గ్రామాల్లో ఇదొకటి. ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం 900 ఏళ్ల క్రితం నాటిదని చరిత్ర చెబుతోంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూ.. తమ పురాతన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచింది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలకు మాత్రం అయ్యాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు రక్షకులు కాపలా కాస్తున్నారట.