Monday, November 25, 2024

Human Trafficking – ఆప‌రేష‌న్‌ బీహార్! మాన‌వ అక్రమ రవాణకు బ్రేక్

అది ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్. అప్పుడే సీమాంచల్ ఎక్స్ప్రెస్ వచ్చి ఫ్లాట్ ఫారంపై ఆగింది. నాస్తా వాలా.. చాయ్ వాలా అరుస్తున్నారు. ఆర్పీఎఫ్ దళం జనరల్ బోగీని చుట్టుముట్టింది. అందులో 9 నుంచి 12 ఏళ్ల వయస్సున్న పిల్లలందరినీ బోగి నుంచి దించింది. వీళ్లకు అప్పటి వరకూ కాపలా కాసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో స్టేషన్ లోని ప్రయాణికులంతా విస్తుపోయి.. వెంటనే తేరుకున్నారు. ఇదేదో హ్యూమన్ ట్రాఫికింగ్ (మాన‌వ అక్ర‌మ ర‌వాణా) అని అర్థం చేసుకున్నారు. అసలు కథేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

- Advertisement -

పాట్నా టూ..ఢిల్లీ

బీహార్లోని వివిధ జిల్లాలకు చెందిన 93 మంది బాలలను తొమ్మిది మంది ఏజెంట్లు సేకరించారు. పిల్లలందరినీ ఢిల్లీకి చేర్చటం వరకే ఏజెంట్ల పని. బుధవారం పాట్నాలో బయలు దేరారు. గురువారం తెల్లవారుజామున సీమాంచల్ ఎక్స్ప్రెస్ ప్రయాగ్ రాజ్ జంక్షన్‌కు చేరుకుంది. అప్పటికే బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తున్నారని రైల్వే ఫ్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం వచ్చింది. ఈ స‌మాచారం అందుకున్న‌ ఆర్పీఎఫ్ ఫోర్స్ రైల్వే స్టేషన్‌లో మొహరించింది. చిన్నారులను కాపాడింది. ఆగంతకులను అదుపులోకి తీసుకుంది. ఈ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించగా. పునరావాస కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ చేస్తున్నారు.

తొమ్మిది మంది అరెస్టు..

పిల్లలను తరలిస్తున్న తొమ్మిది మంది ఏజెంట్లను ఆర్‌పీఎఫ్ బృందం అరెస్టు చేసింది. పిల్లలను తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతి పత్రాలను వారు చూపించలేకపోయారు. అయితే.. పిల్లలను మదర్సాలలో చదివించేందుకు తీసుకువెళుతున్నారని ఏజెంట్ చెప్పాడు. ఈ పిల్లలను తీసుకెళ్తున్న వ్యక్తుల వద్ద ఎలాంటి అనుమ‌తి పత్రాలు లేవు. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరూ ఈ పిల్లలతో కలిసి రాలేదు. ఈ బాలలంతా ముస్లిం పిల్లలే. తొమ్మిది నుంచి 13 ఏళ్ల లోపు వారే కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం పిల్లల కుటుంబీలకు రప్పించి. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.

రెండు వారాల కిందట.. ఇదే కథ

ఉత్తర్‌ప్రదేశ్ చైల్డ్ కమిషన్ ఏప్రిల్ 27న (శుక్రవారం) ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. బీహార్‌లోని వివిధ జిల్లాల నుంచి 99 మంది పిల్లలనుబస్సులో సహరాన్‌పూర్‌కు తీసుకెళ్తున్న ఐదుగురు మత గురువులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పట్టుకుంది.బీహార్‌లోని అరారియా, పూర్నియా ప్రాంతాల నుంచి సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌కు చాలా మంది పిల్లలను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుచితా చతుర్వేదికి సమాచారం అందింది. దీంతో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి సమాచారం అందించారు. ఆ తరువాత అయోధ్య పోలీసుల యూనిట్ నగరంలోని బడి దేవ్‌కలి సమీపంలో హైవేపై బస్సును నిలిపి 95 మంది చిన్నారులు కనిపించారు. వీరితోపాటు ఐదుగురు మౌల్వీలు ఉన్నారు. ఆ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇలా 95 మంది బాలలూ 9 నుంచి 13 ఏళ్ల పిల్లలే. వీరందరీ లక్నోలోని ముంతాజ్ ఆశ్రమంలో ఉంచారు.దొరికిన అయిదుగురు మౌల్వీలూ నకిలీలని తేలింది.

ఈ ట్రాఫికింగ్ టార్గెట్ ఏమిటీ?

బాలల అక్రమ రవాణాలో ఉత్తర ప్రదేశ్, బీహార్ సహా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలోనే ఉందని కేంద్ర నిఘా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. కోవిడ్ కు ముందు తరువాత బాలల అక్రమ రవాణా క్రమేపీ కాదు… బాగా పెరిగింది. 9 నుంచి 12 ఏళ్లలోపు బాల బాలికల అక్రమ రవాణాలో .. దేశ వ్యాప్తం 21 రాష్ర్టాల్లో 261 జిల్లాలు రికార్డు సృష్టించాయి. వీరిలో 15.6 శాతం మంది హోటల్స్ లో, 13 శాతం మంది ఆటోమొబైల్స్ లో వెట్టి చాకిరి చేస్తున్నారు. 11 శాతం బాలికలు వేశ్యగృహాల్లో మగ్గిపోతున్నారు. ఇక తాజాగా మదర్సా ముసుగులో తరలిస్తున్న బాలల గమ్యం ఏమిటీ? మరీ ముఖ్యంగా ముస్లీం బిడ్డల్నే ఎందుకు టార్గెట్ చేశారు. సాధారణంగా ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి కాస్మొపోలిటిన్ సిటీల్లో.. యాచక మాఫియా కూడా పిల్లల్ని కొనుగోలు చేస్తోంది. కానీ.. బీహార్ నుంచి ముస్లీం పిల్లల తరలింపే అనేక అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఉగ్రవాదుల అవసరాలను తీర్చటానికి వీరిని తయారు చేస్తున్నారా? గతంలో లవ్ జిహాద్ పేరిట యువతులను ఏమార్చిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇప్పడు మదర్సాల్లో చదువులు పేరిట నిరుపేద బిడ్డల్ని తరలించమే .. భయాందోళనకు దారితీస్తోందని మానవ హక్కుల సంఘాలు సైతం అనుమానిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement