నేడు బంగారం ..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం భాగ్యనగరంలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ.900 పెరిగింది. దీంతో ముందురోజు రూ.46,100గా ఉన్న ధర ఏకంగా 47 వేల రూపాయలకు ఎగిసింది. చివరగా అక్టోబర్ 6న రూ.47,850 పలికింది. ఈ మధ్య కాలంలో ఇంత మేర పెరగడం ఇదే తొలిసారి. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.990 పెరిగి.. 51 వేల 280 రూపాయలకు చేరింది. ఇక కొద్దిరోజులుగా భారీగా పతనమైన సిల్వర్ కూడా ఇటీవల మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1900 మేర ధర పెరగ్గా.. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.66,300కు పెరిగింది. అంతకుముందు రోజు రూ.400 పెరిగింది. అక్టోబర్‌లో వెండి రేటు గరిష్టంగా రూ.67 వేలకు చేరింది. అది అక్టోబర్ 5న కావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇదే ఒక్కరోజు గరిష్ట పెరుగుదల. అయితే బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, అక్కడి పన్నులను బట్టి స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెరగడంతో కొనేముందు ఒకసారి ఆలోచించండి. రానున్న రోజుల్లో మరింత తగ్గే సూచనలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement