Saturday, November 23, 2024

జురాలకు జల కళ… సాగుకు రైతులు సన్నద్ధం

జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలాశయానికి వరద వస్తున్నది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 25,400 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే, జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.651 టీఎంసీల నీరుంది.

మరోవైపు రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. జిల్లాల్లో తొలకరి జల్లులు పడడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. వరినాట్లు వేసేందుకు రైతులు బిజీ అయ్యారు. సోయా, మొక్కజొన్న, పత్తిపంటలకు ఈ వర్షం ఎంతగానో ఉపయో గపడిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో పత్తిసాగుకు రైతులు ఇప్పటికే దుక్కు లు సిద్ధం చేశారు. ఇంకా చేయనివారు సైతం ఇటీవల కురిసిన వర్షాలతో దుక్కులు చదును చేయడంలో బిజీ అయ్యారు. వానకాలం సాగు ప్రణాళికలకు అనుగుణంగా విత్తనాలను వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు.

ఇది కూడా చదవండి: 30 శాతం పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement