సీ ఈగల్ అనే పేరున్న భారీ నౌక కంటైనర్లు అన్ లోడ్ చేస్తోన్న సమయంలో అదుపుతప్పి నీట మునిగిపోయింది. ఈ నౌక టక్రీలోని ఇస్కెండరమ్ పోర్టుకి వచ్చింది.ఈ నౌకలో బ్యాలెన్స్‌కు సంబంధించిన సమస్య ఉందేమో అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే పడవలోని సిబ్బంది మాత్రం.. దానిలోని అన్ని పరికరాలు చక్కగా పనిచేస్తున్నాయని, అంతకుముందు వరకూ నౌక బాగానే ఉందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 24 కంటైనర్లు కనిపించకుండా పోయాయని అధికారులు చెప్పారు.ఈ భారీ నౌకలో చాలా మంది అక్కడకు చేరుకున్నారు. దాదాపు అందరూ దిగేసిన తర్వాత కంటైనర్లను మెషిన్ల సాయంతో ఒక్కొక్కటిగా అన్‌లోడ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో విజిల్స్ వేసినట్లు శబ్దం వచ్చింది. పడవ పక్కనే ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న వాళ్లందరూ ఆ శబ్దం విని అక్కడి నుంచి పారిపోయారు. వాళ్లు చూస్తుండగానే నెమ్మదిగా ఒక పక్కకు ఒరిగిన ఆ భారీ నౌక.. సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన టర్కీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
The sinking moment of the Sea Eagle in the port of Iskenderun 18.09.2022
byu/anivia3346 ininterestingasfuck