Friday, November 22, 2024

చలాన్‌ ఆఫర్‌కు భారీ స్పందన.. తొలిరోజే రికార్డు వసూలు

హైదరాబాద్ లో అమలు చేస్తున్న ట్రాఫిక్‌ చలానాలకు రాయితీకి భారీ స్పందన వస్తోంది. రాయితీ ప్రకటించిన తొలిరోజు విశేష స్పందన లభించింది. తమ పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఒక్కరోజులోనే రూ. 5.5 కోట్ల మేర కాసుల వర్షం కురిసింది. రాత్రి వరకు 5 లక్షలకు పైగా చలానాలను వాహనదారులు చెల్లించారని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. నిముషానికి వెయ్యికి పైగా చలానాల చెల్లింపులు నడిచాయని చెప్పారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో చలానాల చెల్లింపులు జరగడం ఇదే తొలిసారి.

కాగా, బైకులకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బళ్లకు 80 శాతం రాయితీని పోలీసులు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ-చ‌లాన్ ద్వారా అన్ని పెండింగ్ చ‌లాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపున‌కు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చని సూచించారు. అటు మీ సేవ‌, ఈ సేవ‌లో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement