నేడు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. కొత్త ఏడాదిలో వరుసగా రెండో సెషన్ లో కూడా భారీ లాభాలు నమోదయ్యాయి. బ్యాంకింగ్, పైనాన్సియల్ స్టాక్స్ లాభాలను ముందుండి నడిపాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం మన మార్కెట్లపై ప్రభావం పడింది. దాంతో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 673 పాయింట్లు లాభపడి 59,856కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 17,805కి ఎగబాకింది. ఎన్టీపీసీ (5.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.69%), టైటాన్ (2.31%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.22%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.సన్ ఫార్మా (-1.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.82%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.11%), ఇన్ఫోసిస్ (-0.05%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..