ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న వెయ్యికి చేరువలో వెళ్లిన కరోనా పాజిటివ్ కేసులు..ఇవాళ కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 40,696 సాంపిల్స్ పరీక్షించగా.. 947 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా కారణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. ఇదే సమయంలో 377 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,892కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,97,810కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,58,897 సాంపిల్స్ ని పరీక్షించినట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది. విశాఖ జిల్లాలో 156, చిత్తూరు జిల్లాలో 180, కృష్ణా జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 43, కర్నూలు జిల్లాలో 61, తూ.గో. జిల్లాలో 58, అనంతపురం జిల్లాలో 35, శ్రీకాకుళం జిల్లాలో 56, కడప జిల్లాలో 40, ప్రకాశం జిల్లాలో 23, విజయనగరం జిల్లాలో 156, ప.గో. జిల్లాలో 18 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.