Friday, November 22, 2024

ఒక్కరోజులో 1.45లక్షల కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో వైపు మహమ్మారి బారినపడి 794 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,32,05,0926కు చేరాయి. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 1,68,436 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా 77,567 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్‌ కేసులు 10లక్షల మార్క్‌ను దాటాయి. ప్రస్తుతం దేశంలో దేశంలో 10,46,631 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement