ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి ఇప్పటివరకు 8మందిని రక్షించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ హోటల్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటివరకు ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని రక్షించారు. నగరంలోని Papaya Tree Hotel లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. తొలుత హోటల్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు మరింత వ్యాపించడంతో అత్యవసర సేవలకు ఫోన్ చేయాల్సి వచ్చింది.పొగ కారణంగా భవనంలోని ఆరో అంతస్తులో ఉన్నవారు చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు వారిని సురక్షితంగా తీసుకురావడానికి నిచ్చెనలను ఉపయోగించారు. ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని నిచ్చెనలతో సురక్షితంగా రక్షించారు. పొగ కారణంగా వారు చాలా భయపడ్డారని ఇండోర్ సీనియర్ పోలీసు అధికారి ఆర్ఎస్ నింగ్వాల్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement