సోలమన్ దీవుల్లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ ప్రకంపనల నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. సోలమన్ ఐస్‌లాండ్ రాజధాని హోనియారాకు నైరుతి దిశలో 56 కిలోమీటర్లు దూరంలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇల్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement