నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూకంపం వచ్చింది. ఖాట్మండుకు 53 కిలోమీటర్ల తూర్పున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈరోజు మధ్యాహ్నం 2:52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున నమోదైందని తెలిపారు. ఈ భూకంపం వల్ల ఖాట్మండులోని ఆవాస ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం రావడంతో ఆ ప్రాంతం ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement