జపాన్‌లో కాసేపటి క్రితం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతువరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపంవల్ల ఏదైనా ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టంగానీ జరిగిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement