Sunday, November 10, 2024

కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.1గా న‌మోదు

కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. సముద్రంలో భూకంపం సంభవించినందున, భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేసింది. కాగా, ఈ భూకంపం వల్ల న్యూజిలాండ్‌కు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ పేర్కొంది.గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. న్యూజిలాండ్‍లో గత నెల 15న భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement