నాగర్‌కర్నూల్ జిల్లాలో డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఇవ్వాల (బుధవారం) డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోదాలు చేశారు. బిజినేపల్లి మండలం వట్టెం శివారులోని ఓ కోళ్ల ఫామ్‌లో జరిపిన సోదాల్లో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు. కోళ్ల ఫారమ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతోనే ఈ రైడింగ్ జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ తయారీ యంత్రాలను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
అదేవిధంగా పెద్ద ఎత్తున అల్ఫ్రాజోలమ్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక.. 31.42 కిలోల అల్ఫ్రాజోలమ్ పట్టుబడగా.. ఈ డ్రగ్స్ విలువ సుమారు 3.14 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుస్తోంది.