చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 42మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఈశాన్య చైనాలోని షెన్యాంగ్ లోని హువాంగ్ జిల్లాలోని హువాంగ్ స్ట్రీట్, నింగ్‌షాన్ రోడ్ జంక్షన్ వద్ద జరిగినట్టు చైనా అధికారులు ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారు స్థిమితంగా ఉన్నారని చైనా అధికారులు ప్రకటించారు. భారీ పేలుడుతో షెన్యాంగ్ నగరం ఉలిక్కిపడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. ఈ ఘటన తరువాత చైనా పోలీసు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..