భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీకి ఓ సరస్వతి పుత్రుడు తారసపడ్డాడు.. కానీ, పేదరికం కారణంగా ఓ హైలెవల్ సెమినార్‌కి అటెండ్ కాలేకపోతున్నాడు. ఈ విషయాన్ని రెండ్రోజుల క్రితం రాహుల్ గాంధీతో కలిసినప్పుడు తెలియజేశాడు. ప్రభుత్వ పాటశాల విద్యార్థి అయిన తనకు.. పరిమిత వనరులతో ఉన్న టీచర్ సహాయంతో అత్యంత ప్రతిభ కనపరిచాడు. చదువులో అక్కడి కంటే గొప్పగా నేర్చుకోవాలి అంటే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల తరపున జరిగే Online Classes And సెమినార్స్ లకు అటెండ్ అవ్వాల్సి ఉంది.
ఆ అబ్బాయికి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్లాలని ఆశ.. ఎంతో నేర్చుకోవాలన్న తపన ఉంది. కానీ, అందుకు తగ్గట్టు వనరులు లేవు, లాప్టాప్ కొందాం అంటే ఇంట్లో పేదరికం సహకరించదు. ఇదే విషయం రాహుల్ గాంధీకి చెప్పాడు ఆ అబ్బాయి. ఆ చిన్నోడి ప్రతిభకు, మేధస్సుకు ముగ్ధుడైన రాహుల్ గాంధీ తక్షణమే తన సొంత డబ్బులతో మంచి లాప్ టాప్ కొని ఇవాళ (శుక్రవారం) ఉదయం ఆ పిల్లాడిని క్యాంప్ కు పిలిపించి గిఫ్ట్ ఇచ్చాడు..
ఈ విషయం ఆ కుటుంబం బయటికి తెలిపే దాకా ఎవరికీ తెలియదు. రాహుల్ గాంధీ సన్నిహితులలో కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కానీ ఈ విషయం తెలియదు. అయితే.. ఇతర పార్టీల్లో కొంతమంది తాము చేయనివన్ని చేశాం అని చెప్తున్నారు, కానీ రాహుల్ గాంధీ మాత్రం చేసినవి కూడా చెప్పడం లేదు అని ఈ విషయం తెలిసిన కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా Rahul Gandhi Ji మనసులు దోచేస్తున్నావ్ అయ్యా.. అంటూ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.