Tuesday, November 26, 2024

ఎన్ని గాయాల‌య్యాయో తెలియ‌దు – మ‌లైకా అరోరా

ప్ర‌స్తుతం తాను శారీరకంగా పూర్తిగా దృఢంగా ఉన్నట్లు అనిపిస్తుంది..కానీ త‌న మనస్సులో మాత్రం ఇప్ప‌టికీ భయం, ఆందోళన ఉన్నాయ‌ని తెలిపింది బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా. రీసెంట్ గా పూణేకు స‌మీపంలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరాకి తీవ్ర‌ గాయాల‌య్యాయి. తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పి ప్రాణాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన సుమారు నెల అవుతుంది. చికిత్స అనంత‌రం విశ్రాంతి తీసుకున్న మ‌లైకా అరోరా..మ‌ళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ సంద‌ర్భంగా ఆ ఛేదు అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది. ఆ ఘ‌ట‌న గుర్తుకొచ్చిన‌పుడు నేను ఆటోపైలట్ మోడ్‌లో ఉన్నాను. గాయమైన 15 రోజుల త‌ర్వాత నేను కారులో కూర్చోవడం సురక్షితంగా అనిపించలేదు. నాకు ఎన్ని గాయాల‌య్యాయో తెలియ‌దు. షాక్‌లో ఉన్నాను. ఆ ప‌రిస్థితుల‌ను స్పష్టంగా గ‌మ‌నించ‌లేక‌పోయాన‌ని..ప్ర‌మాదం త‌ర్వాత త‌న మాన‌సిక స్థితిగురించి మ‌లైకా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement