Tuesday, November 26, 2024

భారత హాకీకి ఒడిశా అండ.. స్పాన్సర్‌షిప్ తో పతకాల వేట!

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం అంటే ఏ దేశానికైనా గర్వకారణమైన విషయం. బంగారు పతకం సాధించడం ఓ అద్భుత అనుభూతి. టోక్యో ఒలింపిక్స్ లో భారత హకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. 41 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ ఇండియా.. ప్రత్యర్ధి గ్రేట్ బ్రిటన్ ను ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.

ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. గత ఐదేళ్లుగా ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌షిప్ అందించింది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. 2014 చాంపియన్‌‌స ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో 2018 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఈ సందర్భంలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పాన్సర్‌షిప్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు.

హాకీలో ఎంతో ఘన చరిత్ర ఉన్న భారత్ గత కొద్ది ఏళ్లుగా సత్తా చాటలేకపోతోంది. కానీ, మన్ ప్రీత్ సారధ్యంలో యంగ్ కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే భారత్ కు మరో పతకం ఖాయం. సెమీఫైనల్ లో టీమిండియా బెల్జియంతో తలపడనుంది. భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ఒలంపిక్స్ లో పట్టిష్టమైన కంగారూలను భారత మహిళ టీమ్ చిత్తు చేసింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. మూడుసార్లు ఒలింపిక్స్ లో విజేత అయిన ఆస్ట్రేలియాను 1-0 తేడాతో మట్టికరిపించింది. 1980 మాస్కో ఒలిపింక్స్ తర్వాత భారత్ హాకీ జట్టు అత్యుత్తమైన ప్రదర్శన చేసి…తొలిసారిగా ఒలంపిక్స్‎లో సెమీస్ చేరుకుంది. భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన అందరిని కట్టిపడేసింది. 

కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. భారత పురుషుల హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్నా టీమిండియా ఒక్కసారీ కూడా సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించలేకపోయింది. ఈసారి ఒలంపిక్స్ లో బంగారు పతకం కోసం గెలుపే లక్ష్యంగా పురుషులు, మహిళల జట్లు కృషి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement