Friday, November 22, 2024

రాష్ట్రాల‌కు నిధులివ్వ‌క‌పోతే స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ ఎలా సాధ్యం : కేటీఆర్

ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నార‌ని, రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే అదెలా సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ ఏర్పాటు కానుంది. ఈరోజు ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని కేటీఆర్‌ అన్నారు. గడిచిన ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. కనీసం ఈసారైన కేంద్ర బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ ఇండ్రస్టీయల్‌ రాయితీలు అందించాలన్నారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. త‌మ హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. పెట్టుబడులు పెంట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్‌ మేక్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు.. కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు. కేవలం నినాదంతో మేకిన్‌ ఇండియా సాకారం కాదు.. అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌గా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుచేయబోతున్నామ‌న్నారు. కేంద్రం నుంచి వీటికి సాయం కోరినా స్పందన లేదని, 6 కొత్త ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరామ‌ని అది కూడా కార్యరూపం దాల్చలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement