Saturday, November 23, 2024

Crime Story: హంతకులను పట్టించిన బెడ్ షీట్, పాలిథిన్ కవర్..

ఢిల్లీలో ఈ మధ్య జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి జరిపిన దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.  ఈ విచారణ తమకు సవాల్ గా మారిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. హత్యకు గురైన 20 ఏళ్ల యువకుడి డెడ్ బాడీని బెడ్ షీట్, పాలిథిన్ కవర్లలో చుట్టి పారేశారు. అయితే ఈ కేసులో ఇతర క్లూస్ పోలీసులకు దొరకలేదు. కాగా, ఆ బెడ్ షీట్, పాలిథిన్ కవర్లే వారికి కేసులో ప్రధాన లీడ్ అయ్యాయి.

బేకరీని నడుపుతున్న ఐదుగురు అనుమానితులను పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సరాయ్ రోహిల్లా పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ఆ వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. అతని మృతదేహాన్ని జనవరి 7న టికోనా పార్క్ ఇందర్‌లోక్‌లో పడేయడంతో పోలీసులకు సమాచారం అందింది.. నిందితులు అఫ్జల్ అన్సారీ (45), సవ్జల్ అన్సారీ (38), రసీద్ అన్సారీ (30), ఎండి. ఇస్రాఫిల్ (20), మొహమ్మద్ అబ్రార్ అన్సారీ (27) బిహార్‌లోని జముయి జిల్లాకు చెందిన పదమ్ నగర్ ప్రాంతంలో బేకరీ నడుపుతున్నారు.

ఢిల్లీలోని పర్తాప్ నగర్‌కు చెందిన అభిషేక్‌ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర క్రితం చోరీ చేసిన రెండు ల్యాప్‌టాప్‌లను అభిషేక్ నుంచి  ₹ 5 వేలకు కొనుగోలు చేసినట్లు వారు పోలీసులకు తెలిపారు. అప్పటి నుండి అభిషేక్ తాము దొంగిలించిన ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని, అనేక సందర్భాల్లో వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశాడని దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

వారి నుంచి ₹ 1 లక్ష వరకు అలా వసూలు చేసిన అభిషేక్.. దాదాపు 20 దొంగతనాలు, దోపిడీ కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అభిషేక్ జనవరి 6న బేకరీని సందర్శించి వారి నుంచి ₹20వేలు డిమాండ్ చేశాడు. అతని బ్లాక్‌మెయిలింగ్ నుంచి తప్పించుకోవడానికి అతడిని ఖతం చేయడమే మంచిదని వారు ప్లాన్ చేశారు. తమ పథకం ప్రకారం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారని అధికారి తెలిపారు.  అతడిని చంపేసిన తర్వాత మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, పాలిథిన్ సంచిలో వేసి టికోనా పార్క్ ఇందర్‌లోక్‌లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. సరాయ్ రోహిల్లా పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది.

- Advertisement -

‘‘మేము కేసును ఛేదించడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసాం” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ ఖాల్సీ చెప్పారు. “బాధితుడి కదలికలను అతని ఇంటి నుండి తనిఖీ చేయడానికి చుట్టుపక్కల అమర్చిన అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశాం. అయితే, పదమ్ నగర్ దాటి ఏ సీసీటీవీ  కెమెరాలలోనూ అతని కదలికలు కనిపించలేదు” అన్నారాయన.

విచారణలో హతుడికి నిందితులతో వివాదం ఉన్నట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం బేకరీకి చేరుకుంది. బేకరీలో ఉన్న బెడ్‌షీట్‌లు, పాలిథిన్ బ్యాగ్‌లు హతుడికి ఉన్న వాటిని పోలి ఉన్నాయి.  అందులో బాధితుడి మృతదేహం చుట్టబడి కనిపించింది ”అని కేసు పరిశోధనలో పాల్గొన్న మరో అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement