Friday, November 22, 2024

IPL Auction2022: ఏడాదిలోనే ఎంత దారుణం.. ఈ క్రికెట‌ర్‌కు తిర‌గ‌బ‌డ్డ జాత‌కం..

కృష్ణప్ప గౌతమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో అతడికి ఊహించని ధర రాగా.. ఒక్క ఏడాదిలో అంతా తలక్రిందులైంది. ఐపీఎల్ 2022లో అతడి ధర భారీగా పడిపోయింది. ఒక్క ఏడాదిలోనే కృష్ణప్ప విలువ ఆకాశం నుంచి అట్టడుగుకు పడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్ 2021లో కృష్ణప్ప గౌతమ్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. క‌ర్నాట‌క‌ ఆల్‌రౌండర్‌ అయిన గౌతమ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రికార్డు ధర 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ప్రతిఒక్కరు ఆచ్చర్యపోయారు. స్పిన్ ఆల్‌రౌండర్‌ అవసరం ఉండడంతో చెన్నై భారీ ధర పెట్టాల్సి వచ్చింది. అయితే ఆ సీజన్లో అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక మెగా వేలం 2022 నేపథ్యంలో గౌతమ్‌ను సీఎస్‌కే వదిలేసింది. ఇక ఐపీఎల్ 2022 వేలంలోకి కృష్ణప్ప గౌతమ్‌ 50 లక్షల కనీస ధరతో వచ్చాడు. రెండో రోజు వేలంలో అతడి పేరు రాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అతడిపై ఆసక్తి కనబరిచాయి. అయితే లక్నో సూపర్ జాయింట్స్ 90 లక్షలు పెట్టి అతడిని సొంతం చేసుకుంది. దాంతో సోషల్ మీడియాలో గౌతమ్‌పై జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. ‘హతవిది గతంలో 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు’, ‘ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే ఇదే’ అంటూ కామెంట్లు వస్తున్నాయి. గౌతమ్‌ 2017లో 2 కోట్లు, 2018లో 6.20 కోట్లు, 2021లో 9.25 కోట్లు పలికాడు.

కృష్ణప్ప గౌతమ్‌ మాత్రమే కాకుండా.. ప్యాట్​ కమిన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. 2021లో​ కమిన్స్​ను రూ. 15.50 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్న కోల్​కతా.. ఈసారి రూ. 7.25 కోట్లకే కైవసం చేసుకుంది. అంటే కమిన్స్ ధర సగానికిపైగా తగ్గింది. అయితే భారత ఆటగాడు అవేశ్​ ఖాన్ దశ మాత్రం తిరిగింది. గత సీజన్​లో రూ. 70 లక్షలకే ఢిల్లీకి ఆడిన అతడిని ఈసారి లక్నో ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. 2021లో బెంగళూరుకి రూ. 20 లక్షలకే ఆడిన హర్షల్​ పటేల్​.. ఇప్పుడు రూ. 10.75 కోట్లకు అమ్ముడుపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement