కరోనా రోగుల్లో ఇటీవల చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. దీంతో కరోనా మరణాల్లో హార్ట్ ఎటాక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా బారిన పడ్డ వారిలో ప్రాణభయం పట్టుకుంది. హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? భయమే కారణమా? లేక మరో రీజన్ ఏదైనా ఉందా? కరోనాకి, హార్ట్ ఎటాక్ ఏదైనా సంబంధం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారు?
‘క్లాటింగ్ ఎక్కువైనప్పుడు హార్ట్ ఎటాక్ సంభవించే అవకాశం ఉంది. ఏమీ లేని వాళ్లు కూడా భయపడి చనిపోతున్నారు. కరోనా సోకినప్పుడు చాలామందిలో తక్కువ స్థాయిలో హార్ట్ బీటింగ్ రేటు పెరుగుతుంది. సీరియస్ అయిపోయి సడెన్గా హార్ట్ ఎటాక్ వచ్చే పర్సెంట్ చాలా తక్కువ కనుక నాకు వచ్చేస్తుంది అనే ఆందోళనతో ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొన్ని సమస్యల వల్ల హార్ట్ ఎటాక్ రావొచ్చు. రక్తనాళాలు ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ అటాక్ రావొచ్చు. కానీ, అవన్నీ చాలా తక్కువ పర్సెంటేజీలో జరుగుతాయి. కరోనా రాగానే ఆందోళన చెందితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాము కరిచిన దానికి వచ్చిన సమస్య కంటే, పాము కరించిందనే భయంతో వచ్చే సమస్యలు వస్తాయి. ఆ భయంతోనే చనిపోతారు. కరోనా వల్ల రక్తనాళాల్లో క్లాట్ పోయి హార్ట్ ఎటాక్ సంభంవించడం కంటే ఎక్కువ నాకు ఏమైనా అయిపోతుందనే ఆందోళనతోనే ఎక్కువమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానిపై ప్రజలను చైతన్యపరచాలి’ అని ప్రముఖ కార్డియాలజిస్ట్, డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.
‘కరోనా రోగులు గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. కరోనా చిన్న రోగమే అని తెలిసినా బాధితులు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. అవగాహన, అధైర్యంతో ప్రాణాలకు ముప్పు. ఒత్తిడి, భయానికి లోనవ్వొద్దు. భయం వల్లో కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. భయం, ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరంలో అన్ని భాగాలు ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. బ్లడ్ ప్రెజర్లో వేరియేషన్స్ వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. హార్ట్, కిడ్నీ, కంటి చూపులో ఎక్కువగా సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. స్ట్రెస్, భయం, ఆందోళన మంచివి కావు. కరోనా ఎక్కవ వస్తుందో అనే భయంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కరోనా వచ్చినా భయపడాల్సిన పరిస్థితి లేదు. సాధారణ చికిత్సతోనే నయం చేసుకోవచ్చు’ అని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.