పలువురు జంతుప్రేమికులు శునకాలే కాదు వారికి నచ్చిన ఏ జంతువునయినా ఆఖరికి పులులని కూడా పెంచుకునే వారు ఉన్నారు. కాగా మనం చెప్పుకోబోతున్న గుర్రాలు అతి ఖరీదయినవి. అంతేకాదు వాటి ఫుడ్ కూడా ఎంతో ఖరీదైనవి. ఆ వివరాలు చూద్దాం. ఓ గుర్రాన్ని ఏకంగా ఐదు కోట్ల ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. అయితే ఆ గుర్రం తాలుకా యజమాని అసద్ సయ్యద్ మాత్రం ససేమీరా అన్నాడు. ఎందుకంటే ఇంకా మంచి ధర వస్తుందనే నమ్మకమే దీనికి కారణం. మహారాష్ట్రలోని నందుర్భర్ జిల్లా సరంగ్ ఖేద్ మార్కెట్ బాగా ఫేమస్. పలు రకాల గుర్రాలు ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. ఇది మార్వార్ జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. రోజుకు 10 లీటర్ల పాలు, కేజీ నెయ్యి, 5 గుడ్లు, చిరుధాన్యాలు, తవుడు, డ్రై ఫ్రూట్స్ తింటుంది. ఈసారి నాలుగు రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..