మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ రొమాన్స్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. సుస్మితా అభిమానులు అయితే షాక్‌కు గురయ్యారనే చెప్పవచ్చు. ఏంటీ నీకెవ్వరు దొరకలేదా? ఈ ముసలోడితో ఎఫైర్ ఎందుకు? అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక.. మోదీ, సుస్మిత గాలిచొరబడనంత దగ్గరగా ఉన్న ఫొటోలపై కామెంట్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.
తాను బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్లో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ప్రకటించారు. ఈమేరకు మోదీ ట్విట్టర్లో వారిద్దరు కలిసి ఉన్నఫొటోలను షేర్ చేశారు. సుస్మితను తన ‘బెటర్ హాఫ్’ అని తెలిపారు. ఇది తమ ‘న్యూ బిగినింగ్’ అని అభివర్ణించారు లలిత్ మోదీ.
“కుటుంబంతో కలిసి తిరుగుతున్న గ్లోబల్ టూర్ #మాల్దీవులు #సార్డినియా తర్వాత లండన్‌కు తిరిగి వచ్చాను. – నా #బెటర్‌హాఫ్ @sushmitasen47 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. – చివరకు తనతో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఓవర్ ద మూన్” అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే.. ఈ ట్వీట్ వైరల్ అయిన కొద్ది సేపటికే అతను మరొక ట్వీట్లో “క్లారిటీ కోసం చెబుతున్నా.. ఇంకా మా పెళ్లి కాలేదు. కేవలం ఒకరితో ఒకరం డేటింగ్లో మాత్రమే ఉన్నాం. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది” అని తెలిపారు లలిత్ మోదీ.