రష్యా సేనలు నివాసాలపై ఏకంగా 500కిలోల బాంబ్ ను వేసింది. దాంతో సుమీ నగరంలో నివాసాలపై 500కిలోల బాంబ్ వేశారని..ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించినట్టు ఉక్రెయిన్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ పాలసీ వెల్లడించింది. రష్యా పైలట్లు మానవాళిపై మరో యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఆ శాఖ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. నివాస భవనాలపై వారు 500 కిలోల బాంబ్ వేశారని తెలిపింది. ఇందులో ఇప్పటికే 18 మంది పౌరులు మరణించారని వివరించింది. ఇలాంటి 500 కిలోల బాంబ్‌లు మరికొన్ని చోట్ల నివాసాలపై కూడా పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి దిమిత్రి కులేబా తెలిపారు. ఆయన 500 కిలోల బాంబ్ చిత్రాన్ని ట్వీట్ చేశారు. అదే ట్వీట్‌కు తన ఆందోళననూ జత చేశారు. చెర్నిహివ్ నగరంలో నివాసాలపై 500 కిలోల రష్యన్ బాంబ్ పడిందని వివరించారు. కానీ, అది ఇంకా పేలలేదన్నారు. ఇతర బాంబులు పేలాయని వివరించారు. ఈ పేలుళ్లలలో ఎంతో మంది చిన్నారులు, పురుషులు, మహిళలు మరణించారని పేర్కొన్నారు. రష్యా అనాగరికతనం నుంచి తమ పౌరులను రక్షించడానికి సహరించాలని ఆయన కోరారు. రష్యా వైమానిక సేనలు తమపై దాడి చేయకుండా ఉక్రెయిన్ గగనతలాన్ని వారికి మూసేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు యుద్ధ విమానాలనూ అందించాలని కోరారు. ఏదైనా సరే.. ఉక్రెయిన్ కోసం సహకరించాలని ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement