గాంధీ ఆసుపత్రిలోని డాక్టర్స్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. రోగి స్పృహలో ఉండగానే ఆమె క్లిష్టమైన సర్జరీని నిర్వహించారు. ఓ మహిళ మెదడులోని కణతిని ఆమెకు చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ చాలా ఈజీగా తీసేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహిళ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆమె మెదడులో కణతిని గుర్తించారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసిన వైద్యులు ఆమెను స్పృహలోనే ఉంచి ఆపరేషన్ మొదలుపెట్టారు. ట్యాబ్ లో ఆమెకు సినిమా చూపించి ఆపరేషన్ ప్రారంభించారు.మధ్య మధ్యలో ఆమెతో మాట్లాడుతూ.. అభిమాన నటీనటుల గురించి తెలుసుకుంటూ ఆపరేషన్ కానిచ్చేశారు. ఆపరేషన్ జరుగుతుందన్న ఊహే ఆమెకు రానీయకుండా చేసి మెదడులోని కణతిని విజయవంతంగా తొలగించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇలా స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అంటారని ఆయన తెలిపారు.
గాంధీ ఆసుపత్రి వైద్యుల ఘనత-పేషెంట్ కి ట్యాబ్ లో సినిమా చూపిస్తూ ఆపరేషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement