గుంటూరు జిన్నాటవర్ సెంటర్ వద్ద జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఉద్యోగుల ఛలో విజయవాడపై ఆమె స్పందించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చర్చలకు అవకాశం ఇవ్వలేదనడం అబద్ధమని.. హౌస్ అరెస్ట్‌లు లేవని, అనుమతి లేని సభకు వెళ్లొద్దని చెప్పామన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం జగన్ చెప్పారని.. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని హోంమంత్రి స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నాయని ఆమె అన్నారు.
ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్చా, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామని సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేక స్థానం ఉందని.. జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడ చాలా మంది పుట్టి వుండరని ఆమె అన్నారు. స్వాతంత్య్రానికి ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ ను నిర్మించారని సుచరిత గుర్తుచేశారు. భారత సరిహద్దుల్లో వీర జవాన్ లు కాపలా ఉండటం వలనే మనమందరం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామన్నారు. జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం బాధాకరం, సిగ్గుచేటన్నారు. మానవాళికి మంచి చేసిన వారిని స్మరించుకోవడం మన భారతీయులకు అలవాటని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..