ది లాస్ట్ పిక్చర్ షో, ది పేపర్ మూన్ చిత్రాలతో హాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు పీటర్ బొగ్థనోవిచ్. మాస్క్, డైసీ మిల్లర్ చిత్రాలు ఆయనకు డైరెక్టర్ గా మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇక ఎట్ లాంగ్ లాస్ట్ డ్రైవ్ అనే మ్యూజికల్ డ్రామా డైరెక్టర్ గా పీటర్ కి గుర్తింపుని ఇచ్చింది. నేడు లాస్ ఏంజిల్స్ లోని తన నివాసంలో ఈ ప్రముఖ దర్శకుడు , అస్కార్ అవార్డ్ నామినీ పీటర్ బొగ్దనోవిచ్ కన్నుమూశారు. ఆయన వయసు 82సంవత్సరాలు. ఈ విషయాన్ని పీటర్ బొగ్దనోవిచ్ కుమార్తె ఆంటోనియా తెలిపారు. పీటర్ ముందు నటి లూయిస్ స్టాటెన్ను వివాహం చేసుకున్నారు.
ఆమెతో విడిపోయిన కొద్ది కాలానికి హాలీవుడ్ నిర్మాత పొల్లి ప్లాట్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. తను డైరెక్ట్ చేసిన లాస్ట్ పిక్చర్ షో హీరోయిన్ సైబిల్ షెపర్డ్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. పాత తరం హాలీవుడ్ సినిమాలకు, కొత్త తరం హాలీవుడ్ సినిమాలకు పీటర్ ఓ వారధిలా పనిచేస్తూ తన సేవలను అందించారు. ఆయన మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..