హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ అలన్ లాడ్ కన్నుమూశారు. లాడ్ కుమారై అమందా లాడ్ జోనాస్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. హలీవుడ్ దిగ్గజ ప్రొడక్షన్ హౌజ్అయిన 20వ సెంచరీ ఫాక్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు అలన్ లాడ్. ఆయన ఆయన ఆస్కార్ అందుకున్న చిత్రాల్లో స్టార్ వార్స్,బ్రేవ్ హార్ట్ చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. అలన్ లాడ్ తండ్రి స్టంట్‌మ్యాన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఫిల్మ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. దాన్ని అలన్లాడ్ కొనసాగిస్తూ వచ్చారు. లాడ్ ఫాక్స్, ఎంజీఎం సంస్థలకు హెడ్‌గానూ పనిచేవారు. ఆయన్ని ముద్దుగా హాలీవుడ్ లడ్డీగా పిలుచుకుంటారు. తన కెరీర్లో అనేక బెస్ట్ చిత్రాలను ప్రపంచ ఆడియెన్స్ కి అందించారు లాడ్. అందులో ప్రధానంగా 14 సినిమాలు ది బెస్ట్ గా నిలిచాయి. వాటిలో యంగ్ ఫ్రాంకెన్ స్టీన్, ది రాకీ హర్రర్ పిక్చర్ షో, చారియట్స్ ఆఫ్ పైర్, బ్రేడ్ రన్నర్,స్టార్ వార్స్ చిత్రాలున్నాయి. వీటితోపాటు సొంతంగా నిర్మాగా వన్స్ అన్ ఏ టైమ్ ఇన్ అమెరికా, ది రైట్ స్టఫ్, గోన్ బేబీ బోన్, బ్రేవ్ హార్ట్ చిత్రాలున్నాయి. బ్రేవ్ హార్ట్ సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే.
అంతేకాదు ఆయన సారథ్యంలో వచ్చిన సినిమాల్లో సినిమాలు దాదాపు 50 ఆస్కార్ అవార్డులను అందుకున్నాయి. 150 సినిమాలు నామినేట్ అయ్యాయి. అలన్ లాడ్.. హీరోలకు సానుకూలంగా ఉంటారు. అందుకే ఆయన్ని అనేక మంది స్టార్స్, మేకర్స్ ఇష్టపడుతుంటారు. ఎస్వైర్ మేగజీన్ ఏకంగా 1978లో ఆయన్నీ కీర్తిస్తూ ట్రంఫ్ ఆఫ్ ది లైడ్ బ్యాక్ స్టైల్‌గా వర్ణించింది. కవర్ పేజ్‌పై ప్రింట్ చేయడం విశేషం.ఇక అలన్ లాడ్ మృతి పట్ల హాలీవుడ్ సినిమా సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మరణం ప్రపంచ సినిమాకి తీరని లోటని విచారం వ్యక్తం చేసింది.