నేడు హోలీ పండుగని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రంలో అత్యంత వైభవంగా హోళీ వేడుకల్ని నిర్వహించారు. మహాకాలుడికి భస్మ హారతి నిర్వహించే సమయంలో.. గులాబీ రంగులతో పూజలు నిర్వహించారు. శివుడిని అలకరించిన తర్వాత పూజారులు ఆలయ గర్భగుడిలో గులాల్ రంగులు చల్లుకున్నారు. భస్మ హారతి వీక్షించేందుకు వచ్చిన భక్తులపై కూడా ఆ రంగులు చల్లారు. ఉత్తర భారతదేశం లో హోళీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహాల్లో తేలిపోతున్నారు. బెంగాల్‌లో డోల్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు ఒకరికి ఒకరు గులాల్ రాసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement