ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి పాకిస్థాన్ విద్యార్థులు ..భారత జెండాలు పట్టుకుని ..భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయడం గమనార్హం. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉక్రెయిన్ సరిహద్దులకి చేరుకుంటున్నారు వారంతా. దీనికి సంబంధించిన కథనాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో భారత పౌరుల రక్షణ కోసం ఇండియా అన్ని రకాల చర్యలు తీసకుంటోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన వరుస పెట్టి అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి “ఆపరేషన్ గంగా” ను ప్రారంభించింది. ‘ఆపరేషనల్ గంగా’ కింద కొనసాగుతున్న తరలింపు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే ప్రయత్నాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను సైతం భారత్ రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలోనే తన పౌరుల రక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను యావత్ ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోంది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా.. భారత రాయబార కార్యాలయం పౌరులను భారత జెండాలను చేతపట్టుకోవాలనీ, నిర్భయంగా సరిహద్దు వైపు వెళ్లాలని సూచించింది.
రష్యాతో.. భారత్‌కు ఉన్న సత్సంబంధాల కారణంగా భారత్ జెండాలు కనిపించిన.. విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో రష్యా దాడులు చేయడం లేదు. మన పౌరులకు హాని చేయడం లేదు. అయితే, భారతీయ జెండాల ద్వారా భారతీయ పౌరులకు అందించే భద్రతను సద్వినియోగం చేసుకోవడానికి మరొక సమూహం ఇప్పుడు సిద్ధంగా ఉంది. వారెవరో కాదు, భారత్‌కు శత్రువైన పాకిస్థాన్. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తానీ విద్యార్థులు ఇప్పుడు సంఘర్షణ ప్రాంతాల నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ జాతీయ ఛానల్, పలు యూట్యూబ్ ఛానెల్స్ వీడియోలను ప్రసారం చేశాయి. సరిహద్దులను సురక్షితంగా దాటేందుకు పాక్ విద్యార్థులు ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.