కరోనాతో పాటు ఒమిక్రాన్ అతి వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని కూడా ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. ఒమిక్రాన్ పై పరిశోధన చేసిన పరిశోధకులకు షాక్ అయ్యే విషయం తెలిసిందట. ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందని బయటపడిందట. దక్షిణాఫ్రికాలో 18-45ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ ఐవీకి గురయ్యారట. ప్రపంచ హెచ్ ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిపోయిందిద. హెచ్ఐవీ సోకినా ఎటువంటి మందులు వాడని వారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీన పడి ఇతరత్రా వ్యాధులకు ఆలవాలంగా మారింది.
సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని..ఆమె శరీరంలోని హెచ్.ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్ గా అవతరించిందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో.. కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టే.. అక్కడే ఒమిక్రాన్ గా అవతరించి ఉండొచ్చు అని డా.కెంప్ వివరించారు. మరి దీన్ని ఏ విధంగా అంతమొందిస్తారనేది చూడాలి. ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేయాల్సి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి హెచ్ఐవి, ఒమిక్రాన్ కి కలిపి మందును కనిపెట్టాల్సి ఉంది. ఏం జరగనుందోచూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..