అమెరికాలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్‌ను వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు. హ్యూబర్ కంపెనీ వాచీని హిట్లర్‌కు పుట్టిన రోజు కానుకగా ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.
1933లో ఈ వాచ్‌ను హిట్లర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఏడాదే ఆయన జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1945లో బెర్‌గాఫ్‌లో ఉన్న హిట్లర్ ఇంటిని అటాక్ చేసిన సమయంలో అక్కడ ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచ్ చిక్కింది. ఆ వాచ్‌పై స్వస్తికాతో పాటు ఏహెచ్ గుర్తులు ఉన్నాయి. మేరీల్యాండ్‌లోని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్ హౌజ్‌లో వేలం జరిగింది. ఈ వేలాన్ని యూద నేతలు ఖండించారు.