Tuesday, November 26, 2024

బెంగుళూరు ఖాళీ చేసిన హితేషా… జొమోటో కేస్ న్యూ ట్విస్ట్

బెంగళూరులో జరిగిన జొమాటో డెలివరీ బాయ్ వివాదం తెలిసిందే.కాగా ఈ స్టోరీ మరో ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ కామరాజ్ తనపై దాడి చేశాడని ఆరోపించిన హితేషా బెంగళూరు విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. కామరాజ్ తిరిగి తన పై కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం కోసం ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె లేదట. ప్రస్తుతం మహారాష్ట్రలోని తన అత్త ఇంట్లో ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆమె తిరిగి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడానికి సమయం ఇచ్చామని…సమయానికి రాకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. జొమోటో డెలివరీ బాయ్ కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు దాడి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తనను చెప్పులతో కొట్టిందని తన పరువుకు భంగం కలిగించిందని కామరాజ్ ఫిర్యాదు లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement