Tuesday, November 26, 2024

రెండేళ్ల బాలుడిని మింగిన హిప్పో పోట‌మ‌స్.. అదృష్ట‌వ‌శాత్తు బ‌య‌ట‌ప‌డిన బాలుడు

రెండేళ్ల ఆలుడిని మింగింది హిప్పో పోట‌మ‌స్. ఈ సంఘ‌ట‌న ఉగాండాలో చోటు చేసుకుంది.అయితే అదృష్టవశాత్తూ తిరిగి ఆ బాలుడు హిప్పో నోటి నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను యూకే టెలిగ్రాఫ్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. పాల్ ఇగా అనే బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అతడి ఇల్లు కట్వే ప్రాంతంలోని ఎడ్వర్డ్ సరస్సుకు 800 మీటర్ల దూరంలో ఉంది.

ఉన్నట్టుండి నీటి నుంచి బయటకు వచ్చిన హిప్పో బాలుడ్ని నోట కరుచుకుని మింగేసింది. దీన్ని అక్కడికి సమీపంలోనే ఉన్న క్రిస్ పాస్ బగంజా అనే వ్యక్తి చూశాడు. వెంటనే రాళ్లు తీసుకుని హిప్పోపై విసరడం మొదలు పెట్టాడు. దీంతో అది మింగేసిన బాలుడ్ని బయటకు ఉమ్మేసింది.హిప్పో తిరిగి సరస్సులోకి వెళ్లిపోయింది. ఇదంతా నిమిషం వ్యవధిలోపే జరిగిపోవడంతో, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం బాలుడ్ని సమీపంలోని క్లినిక్ కు తరలించారు. అతడికి కొన్ని గాయాలు కావడంతో చికిత్స చేసి, ఎందుకైనా మంచిదని ర్యాబిస్ టీకా ఇచ్చి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement