హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో నేడు నాలుగు ఒప్పందాలనుకు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోకాకోల సంస్థ 25 ఏళ్లుగా సేవలందిస్తోందని కేటీఆర్ అన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు. అక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. అక్కడ ఏర్పాటు కాబోయే కొత్త పరిశ్రమ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అంతేగాక, కోకాకోలా కంపెనీ భవిష్యత్లో మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని వివరించారు. ఆ సంస్థలో మహిళలకు 50 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కంపెనీ స్థానికంగా దొరికే వనరులను వాడుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని సంస్థను కోరారు.
తెలంగాణలో కోకాకోలా బేవరేజస్ సంస్థ పెట్టుబడులు – హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement