తాను చవిదే స్కూల్లో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైన సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షురావుకు ప్రశంసలు వెల్లువెతుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు అభినందనలు చెప్పిన వారందరికీ హిమాన్షు ధన్యవాదాలు తెలుపారు. తనకు ఆది నుంచి మద్దతుగా నిలిచిన వారందరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘’నా పాఠశాలకు CAS ప్రెసిడెంట్గా మారాలని కోరుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు! మొదటి నుండి నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు నన్ను మరింత ప్రోత్సహించాయి. ప్రతిరోజూ మరింత శక్తివంతం చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి’’ అని హిమాన్షు ట్వీట్ చేశాడు.