Thursday, November 21, 2024

సీఎం కేసీఆర్‌కు హిమాన్షు జన్మదిన శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన మనుమడు, మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. మీ ఓర్పు, నిబద్ధత, కరుణ.. తెలంగాణతో పాటు ఈ దేశ పౌరులకు అవిశ్రాంతంగా సేవ చేయాలనే దృక్పథం అత్యంత స్ఫూర్తిదాయకం. మీ కంటే మంచి తాత మరొకరు లేరు. ఐ లవ్‌ యూ టు ది మూన్‌ అండ్‌ బ్యాక్‌ (మరో వ్యక్తి పట్ల బలమైన ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగించే పదబంధం)’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటిన ఫొటోలను జతచేస్తూ.. ‘మా తాతయ్య, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నేను, మా కుటుంబం హరితహారం, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కొన్ని మొక్కలు నాటాం’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement