విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. కర్నాటక హైకోర్టు మంగళవారం హిజాబ్ వివాదం కేసులో తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత రాష్ట్రంలోని యాద్గిర్‌లోని సురపుర తాలూకా కెంబావి ప్రభుత్వ పీయూ కళాశాల విద్యార్థులు పరీక్షను బహిష్కరించి వెళ్లిపోయారు. విద్యార్థులకు మెయిన్ పరీక్షలకు ముందు సన్నాహక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా హిజాబ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలోపు ముగియాల్సి ఉంది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను పాటించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. “కానీ వారు నిరాకరించి పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళిపోయారు. మొత్తం 35 మంది విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లిపోయారు’’ అని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, తీర్పుపై తల్లిదండ్రులతో చర్చించి, హిజాబ్ ధరించకుండానే తరగతికి హాజరవుతారో లేదో నిర్ణయిస్తామని విద్యార్థులు తెలిపారు. మేము హిజాబ్ ధరించి పరీక్ష రాస్తాము. హిజాబ్‌ను తొలగించమని వారు అడిగితే, మేము పరీక్షలు రాయము”అని ఒక విద్యార్థి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..